తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలకు అందనంత ఎత్తుకు 'న్యాయ వ్యవస్థ' : రాష్ట్రపతి - పేదలకు అందనంత ఎత్తుకు 'న్యాయ వ్యవస్థ' రాష్ట్రపతి

సామాన్యులకు అందనంత ఖరీదైనదిగా న్యాయ వ్యవస్థ మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. పేదలకు ఉచిత న్యాయం అందించాలని సూచించారు. గాంధీ మార్గంలో నడిస్తే ఆది సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

udicial process beyond reach of poor says President ramnath kovindh
పేదలకు అందనంత ఎత్తుకు 'న్యాయ వ్యవస్థ' : రాష్ట్రపతి

By

Published : Dec 7, 2019, 6:20 PM IST

దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్. న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఆ రాష్ట్ర​ హైకోర్టు నూతన భవన ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఆయన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిచాలని సూచించారు.

"న్యాయ ప్రక్రియ అనేక కారణాల వల్ల ఖరీదైనదిగా మారిపోయింది. ఎంతగా అంటే సాధారణ పౌరులకు అందనంతగా.. ప్రత్యేకించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో అది అసాధ్యంగా మారింది.
ఈ రోజు పేద, అణగారిన వారు ఎవరైనా తమ ఫిర్యాదుతో ఇక్కడకు(కోర్టుకు) రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఎందుకంటే రాజ్యాంగానికి ముందుమాటలో, అందరికీ న్యాయం అందించే బాధ్యతను మనమందరం అంగీకరించాము. మహాత్మ గాంధీ ప్రసిద్ధ ప్రమాణాన్ని మనం గుర్తుంచుకుంటే, పేద, బలహీనుల దీనస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మనం సరైన మార్గాన్ని చూస్తాం."
-రామ్​నాథ్​ కోవింద్​, భారత రాష్ట్రపతి

సుప్రీం కోర్టు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తీర్పు వెలువరచడం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి.

ఇదీ చదవండి:నిత్యానందకు షాక్​.. పాస్​పోర్టుకు విదేశాంగశాఖ చెక్​

ABOUT THE AUTHOR

...view details