దేశంలో శాసనసభలో ప్రాతినిధ్యంలో లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా వారి సరసన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. మహారాష్ట్రలో ఠాక్రేతో కలిపి ఇప్పటి వరకు 8మంది ఈ విధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
అందరూ కాంగ్రెస్సే!
కాంగ్రెస్ నేతలు( ఏఆర్ అంతులయ్, వసంత్‌దాదా పాటిల్, శివాజిరావ్ నిలంగెకర్-పాటిల్, శంకర్రావ్ చవాన్, సుశీల్ కుమార్ శిందే, పృథ్వీరాజ్ చవాన్) ఇదే విధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఇదే తరహాలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఎవరైనా అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యునిగా లేకుండా సీఎం పదవి చేపడితే.. ఆరు నెలల్లోగా వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాలి.
ఈ తరహాలో మహారాష్ట్రలో తొలిసారి పదవి చేపట్టిన నేత అంతులయ్. 1980 జూన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.
ఎంపీగా రాజీనామా చేసిన అనంతరం 1983 ఫిబ్రవరిలో సీఎం పీఠాన్ని అధిరోహించారు వసంత్‌దాదా పాటిల్.