మహారాష్ట్ర రాజకీయాల్లోని బలమైన పార్టీల్లో శివసేన ఒకటి. పార్టీ స్థాపించిన సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఠాక్రే కుటుంబ సభ్యులు రాకూడదనే నియమంగా ఉండేది. అయితే.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ నియమాన్ని పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి పదవితో పాటు.. కీలక మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు.
ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరిని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురానున్నారనే వార్తలు జోరందుకున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ.. కీలక నిర్ణయం తీసుకుంది శివసేన. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను.. శివసేన అధికార పత్రిక సామ్నాకు ఎడిటర్‌గా నియమించారు.