మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు తొలిసారి ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు ఉద్ధవ్‌ఠాక్రే. ఈ విషయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
"ఉద్ధవ్ ఠాక్రే నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి దేశ రాజధానికి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే."