తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బీదర్'​ విమానాశ్రయం ప్రారంభం - బెంగళూరు నుంచి బీదర్​కు

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇవాళ బీదర్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ ఎయిర్​పోర్ట్​ అందుబాటులోకి వచ్చినందున బెంగళూరు నుంచి బీదర్​కు గంటన్నర సమయంలో వెళ్లొచ్చని తెలిపారు.

Udan project Finally Bidar airport has inaugurated today.
బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించిన యడియూరప్ప

By

Published : Feb 7, 2020, 11:19 PM IST

Updated : Feb 29, 2020, 2:13 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్​ ప్రాజెక్టులో భాగంగా బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. బెంగళూరు విమానాశ్రయంలో కొవ్వొత్తి ద్వారా ప్రారంభించారు.

బీదర్​ విమానాశ్రయాన్ని ప్రారంభించిన యడియూరప్ప

"బెంగళూరు నుంచి బీదరుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవాలంటే సుమారు 14 గంటల సమయం పడుతుంది. కానీ ఈ విమాన సేవల ద్వారా కేవలం గంటన్నర సమయంలోనే చేరుకునే వీలు కలుగుతుంది. ఈ ఎయిర్​పోర్టును ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది."
-యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి.

ఆ తర్వాత ముఖ్యమంత్రితో సహా మరో 71 మంది ప్రయాణికులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీదర్​ విమానాశ్రయానికి బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో ప్రయాణించారు.

ఇదీ చూడండి:ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

Last Updated : Feb 29, 2020, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details