ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్'ను స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ కృషికి గాను.. యూఏఈ ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత ఏప్రిల్‌లో దివంగత అల్ నహ్యాన్ జయంతి సందర్భంగా మోదీకి యూఏఈ సర్కారు ఈ అవార్డును ప్రకటించింది.
బంధాల బలోపేతంపై చర్చలు