తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రికెట్​ బాల్​కు డబ్బులు ఇవ్వలేదని టవరెక్కారు - pode village

క్రికెట్​ బాల్​ కోసం ఇద్దరు యువకులు హైటెన్షన్​ విద్యుత్​ టవర్ ఎక్కారు.​ దాదాపు ఆరు గంటల హై డ్రామా తర్వాత.. ఎట్టకేలకు కిందకి దిగారు.

madhya pradesh, cricket ball, high tension
క్రికెట్​ బాల్​కు డబ్బులు ఇవ్వలేదని 'హైటెన్షన్​'

By

Published : Feb 8, 2021, 2:18 PM IST

క్రికెట్​ బాల్​ కొనడానికి ఇంట్లో వాళ్లు డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు యువకులు హైటెన్షన్​ విద్యుత్​ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సిధీ జిల్లా పోడే గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని దించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అమిత్​, గౌరవ్​ అనే ఈ ఇద్దరు యువకులు దాదాపు 6 గంటల పాటు టవర్​ మీదే ఉన్నారు.

క్రికెట్​ బాల్​కు డబ్బులు ఇవ్వలేదని 'హైటెన్షన్​'

వారంతట వారే..

ఈ ఇద్దరు యువకులు కొన్ని గంటల తర్వాత టవర్​ నుంచి దిగారు. దీంతో గంటల పాటు ఆ ప్రాంతంలో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. అయితే మొదట గౌరవ్ తనంతట తాను టవర్​ దిగిపోగా పోలీసుల కృషితో కాసేపటికి అమిత్​ కిందకి చేరుకున్నాడు. ఈ క్రమంలో యువకులు గాయపడగా.. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టవర్​కు విద్యుత్​ సరఫరా లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి :'ఒబామాకు ఆతిథ్యమిచ్చినట్టు.. వారినీ ఇంటికి పిలవండి'

ABOUT THE AUTHOR

...view details