తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాచుపాముతో రెండేళ్ల బాలుడి ఆటలు.. చివరికి! - కర్ణాటక తాచుపాము

కర్ణాటకకు చెందిన రెండేళ్ల వేదాంత్​.. ఓ తాచుపామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పాము కాటువేయకుండా అక్కడి నుంచి జారుకుంది. దీనితో బాలుడి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Two-year Old Kid Curious to touch the tail  Of snake: Just missed by the bitten of the Cobra
తాచుపాముతో రెండేళ్ల బాలుడి ఆటలు.. చివరికి!

By

Published : Jun 13, 2020, 9:37 AM IST

Updated : Jun 13, 2020, 9:43 AM IST

కర్ణాటకలోని బెళగావిలో ఓ రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఓ పొలంలో ఆడుకుంటుండగా బాలుడికి తాచుపాము కనిపించింది. దాని తోక పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ బాలుడు.

తాచుపాముతో రెండేళ్ల బాలుడి ఆటలు.. చివరికి!

ఇదీ జరిగింది...

బెళగావి జిల్లాలోని కంగ్రెల్లిలో ఓ తండ్రి తన కొడుకు వేదాంత్​ను​ పొలానికి తీసుకెళ్లాడు. తన రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఆ దృశ్యాలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఓ తాచుపాము అటుగా వెళ్లింది. అది గమనించిన వేదాంత్​ దానివైపు పరిగెత్తాడు. దాని తోకను పట్టుకోవాలని ప్రయత్నించాడు.

తాచుపాముతో రెండేళ్ల బాలుడి ఆటలు.. చివరికి!

ఇది గమనించిన తండ్రి.. తన వద్దకు వచ్చేయమని వేదాంత్​వైపు చూసి అరిచాడు. అనంతరం కొడుకువైపు పరిగెత్తాడు. ఇంతలో తాచుపాము అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ ఘటనపై వేదాంత్​ తాత స్పందించారు. పాములు అందరినీ కాటేస్తాయన్న ధోరణితో ఉండకూదని తెలిపారు. పాముకు హాని తలపెడితేనే అది మనిషిని కాటేస్తుందని.. లేకపోతే ఏమీ చేయవని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన నుంచి తమ మనవడు సురక్షితంగా బయటపడటం సంతోషకరమన్నారు.

Last Updated : Jun 13, 2020, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details