పంజాబ్ సంగ్రూర్ జిల్లా భగవాన్పురలో రెండేళ్ల బాలుడు ఫతేవీర్ మృత్యువుకు తలొగ్గాడు. ఈ నెల 6న బోరుబావిలో పడిన చిన్నారి ఫతేవీర్ను సహాయక బృందాలు దాదాపు 5 రోజులపాటు నిర్విరామంగా శ్రమించి బయటకు తీశాయి. బోరుబావి నుంచి బయటకు తీసిన అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మృత్యువుకు తలొగ్గిన చిన్నారి ఫతేవీర్ - borewell
పంజాబ్లో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు ఫతేవీర్ మృత్యువుకు తలొగ్గాడు. ఐదు రోజులపాటు శ్రమించి అతన్ని బయటికి తీశాయి సహాయక బృందాలు. దాదాపు 110 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి చిన్నారిని తీసినా ఫలితం దక్కలేదు.
మృత్యువుకు తలొగ్గిన చిన్నారి ఫతేవీర్
తన పుట్టిన రోజైన ఈ నెల 6న ఇంట్లో ఆడుకుంటూ పక్కనే ఉన్న బోరుబావిలో పడ్డాడు ఫతేవీర్. అప్పటి నుంచి ఆ చిన్నారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం, పాటియాల సాయుధ ఇంజినీర్ల రక్షణ దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. దాదాపు 110 గంటల అనంతరం బోరుబావి నుంచి బాలుడిని వెలికితీసాయి. ఇంత శ్రమించినా బాలుడు దక్కలేదు.
ఇదీ చూడండి : 5 రోజులుగా బోరుబావిలోనే పంజాబ్ చిన్నారి
Last Updated : Jun 11, 2019, 1:06 PM IST