విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇద్దరు పైలట్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. విమాన శిక్షణకు హాజరైన అనంతరం వీరికి వైరస్ నిర్థరణ కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
"విధుల్లోకి హాజరైన ఇద్దరు పైలట్లకు దురదృష్టవశాత్తు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరు ఫైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్‌కు హాజరయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. వీరిని ప్రత్యక్షంగా కలిసిన వారితో పాటు సెకండరీ కాంటాక్ట్స్‌ను కూడా హోం క్వారంటైన్లో ఉంచాం."
-- విస్తారా ప్రతినిధి.
ఈ ఇద్దరిని ప్రత్యక్షంగా కలిసిన పైలట్లను కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసినట్టు పేర్కొంది విస్తారా. వీరిలో కొందరి పరీక్షలు నెగెటివ్‌గా వచ్చినట్టు.. మరికొందరి రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించింది. సిమ్యులేటర్ ట్రైనింగ్ సెంటర్లో శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు చేపట్టాల్సిందిగా ఆదేశించినట్టు వివరించారు. పాజిటివ్‌గా తేలిన ఇద్దరు పైలట్లకు సంస్థ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కస్టమర్ల భద్రత కోసం అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపింది.
ఇదీ చూడండి:-'ప్రైవేటు'లో కరోనా చికిత్స ఫీజుపై పరిమితి