కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం - ఉగ్రవాదులు హతం
08:15 December 09
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని టికెన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు. అది ఎన్కౌంటర్కు దారితీసింది.
ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. వారు అల్-బద్రే ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.