తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​: ట్రక్కు డ్రైవర్లపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి - two members dead in kashmir

యాపిల్స్​ కోసం వెళ్లిన మూడు ట్రక్కులపై ముష్కరులు దాడి చేసిన ఘటన కశ్మీర్​ షోపియాన్​​ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కశ్మీర్​లో ముష్కరులు దాడి... ఇద్దరు మృతి..

By

Published : Oct 25, 2019, 12:34 AM IST

కశ్మీర్​లో మరోసారి ముష్కరులు దాడికి పాల్పడారు. షోపియాన్​ జిల్లాలో యాపిల్స్​ను లోడ్​ చేయటానికి వెళ్లిన ట్రక్కుల​పై ముష్కరులు దాడి చేయగా ఇద్దరు చోదకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గడిచిన 10 రోజుల్లో ఇది మూడో ఘటనని అధికారులు తెలిపారు. ట్రక్​ డ్రైవర్లు... భద్రతా దళాలకు సమాచారం ఇవ్వకుండా వెళ్లారని అధికారులు వెల్లడించారు.

ఇదీ జరిగింది...

యాపిల్​ కోసం కశ్మీర్​ షోపియాన్​ జిల్లాలోని చిత్తార్​గామ్​ గ్రామానికి వెళ్లిన మూడు ట్రక్కులపై ముష్కరులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఉగ్రవాదులు దాడి చేయగానే చోదకులు పారిపోవటానికి ప్రయత్నించగా.. వారిని తుపాకితో కాల్చి చంపి తర్వాత రెండు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ముష్కరులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్​ అల్వార్​కు చెందిన మహ్మద్. గాయపడిన మరో వ్యక్తిని పంజాబ్‌ హోషియార్‌పూర్‌కు చెందిన జీవన్​గా పోలీసులు గుర్తించారు. మరోక వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది.

అక్టోబర్​ 14న...

అక్టోబర్​ 14న ఇద్దరు ఉగ్రవాదులు షోపియాన్​ జిల్లాలోని పండ్ల వ్యాపారిపై దాడి చేసి, రాజస్థాన్​కు చెందిన ట్రక్కు డ్రైవర్​ను కాల్చి చంపారు. రెండు రోజుల తర్వాత షోపియాన్​లో పంజాబ్​కు చెందిన యాపిల్​ వ్యాపారి చరణ్​జిత్​ సింగ్​ను కాల్చి చంపారు. ఈ దాడిలో సంజీవ్​ అనే మరో వ్యక్తి గాయపడ్డాడు.

ఇదీ చూడండి:'మహా'లో మళ్లీ భాజపా-సేనదే అధికారం- పీఠం చెరిసగం!

ABOUT THE AUTHOR

...view details