కశ్మీర్‌లోని నర్వాల్ బైపాస్ వద్ద పోలీసులు ఇద్దరు తీవ్రవాదుల్ని శుక్రవారం అరెస్టు చేశారు. తీవ్రవాదుల కదలికలపై వచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక చెక్ పాయింట్ ఏర్పాటు చేశామని.. ఈ క్రమంలోనే వారిని పట్టుకున్నామని తెలిపారు. నిందితులు చురాత్కి చెందిన రాయిస్ అహ్మద్ దర్, ఆష్ముజీకి చెందిన సుబ్జార్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు.
"శుక్రవారం సాయంత్రం 5.30కి ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. కారులో వచ్చిన నిందితులు చెక్ పాయింట్ నుంచి తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమైన ప్రత్యేక బృందం వారిని వెంబడించి పట్టుకుంది. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగులో ఓ ఏకే రైఫెల్ , పిస్టోల్ సహా వాటి మ్యాగెజీన్లు లభ్యమైయ్యాయి."