జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. త్రాల్ సెక్టార్‌లోని హరి-పారి ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం ఆధారంగా సైన్యం తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో భద్రతా బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు.. సైన్యంపైకి కాల్పులకు దిగారు. దీంతో ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం - ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో సైన్యం- ఉగ్రవాదులు మధ్య భీకర పోరు జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులని మట్టుబెట్టింది సైన్యం.
ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఉగ్రవాదుల చర్యను.. భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఎదురుకాల్పులకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
Last Updated : Feb 18, 2020, 9:37 AM IST