జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మెల్హురా, జైనాపురా ప్రాంతాల్లో తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత దళాలకు తారసపడిన ఉగ్రవాదులు... సైన్యంపైకి కాల్పులకు తెగపడ్డారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ఉగ్రవాదులు హతం - Jammu Kashmir latest news
జమ్ముకశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
దీంతో సైన్యం ఎదురు కాల్పులు జరపగా... ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం మరో గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఘటనాస్థలంలో ఏకే రైఫిల్, పిస్తోల్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది సైన్యం.సోమవారం జరిగిన ఎన్కౌంటర్లోనూ ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను'
Last Updated : Oct 20, 2020, 5:27 PM IST