తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2020, 9:39 AM IST

Updated : Jun 19, 2020, 3:36 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో 30 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

Two terrorists hiding in the mosque also neutralised by the operation party.
కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

11:52 June 19

పాక్​ కాల్పుల విరమణ...

కశ్మీర్​లో వరుస ఎన్​కౌంటర్లు జరుగుతున్న వేళ.. మరోవైపు పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ వద్ద నౌశెరా సెక్టార్​లో కాల్పుల విరమణ ఉల్లంఘించింది. మోర్టార్​ షెల్లింగ్​లు ప్రయోగించారు పాక్​ భద్రతా సిబ్బంది. భారత సైన్యం ఈ దాడిని దీటుగా తిప్పికొడుతోంది. 

10:42 June 19

మరో ఉగ్రవాది హతం...

కశ్మీర్​ షోపియాన్​​ జిల్లాలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. మునాంద్​ ప్రాంతంలో గురువారం నుంచి చేపట్టిన ఆపరేషన్​లో మొత్తం ఐదుగురిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. పుల్వామాలో మరో ముగ్గురిని హతమార్చాయి. 

గడచిన 30 గంటల్లో ఈ రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో మొత్తం 8 మంది ముష్కరులు హతమయ్యారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

10:06 June 19

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్​ను చేపట్టాయి భద్రతా దళాలు. పుల్వామా, షోపియాన్​లలో వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు జరిపాయి. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం ఏడుగురిని మట్టుబెట్టాయి. 

పుల్వామా జిల్లా పొంపోర్​ మీజ్​ ప్రాంతంలో గురువారం ఒక ముష్కరుడిని హతమార్చిన భద్రతా సిబ్బంది.. ఇవాళ మరో ఇద్దరిని అంతమొందించారు. మసీదుల్లో నక్కిన ఉగ్రవాదులను వేటాడి మరీ చంపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

మరోవైపు షోపియాన్​ జిల్లా మునాంద్​ ప్రాంతంలోనూ ఆర్మీ ఆపరేషన్​ గురువారం నుంచీ కొనసాగుతోంది. ఇక్కడ గురువారం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇవాళ మరో ముగ్గురిని హతమార్చగా.. ఈ ఆపరేషన్​లో మొత్తం నలుగురు ముష్కరులు చనిపోయారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. 

09:35 June 19

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్ర ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లా పాంపోర్​లో... గురువారం మసీదులో నక్కిన ఇద్దరు ముష్కరులను ఇవాళ మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. మొత్తం ఈ ఆపరేషన్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరోవైపు షోపియాన్​ జిల్లా మునాంద్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇవాళ మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. ఈ ఆపరేషన్​లో ఇప్పటివరకు ఇద్దరు ముష్కరుల్ని అంతమొందించారు. 

Last Updated : Jun 19, 2020, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details