బెంగుళూరులో ఉంటున్న ఇద్దరు ఐసిస్ సంబంధిత వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. యవతను ప్రేరేపిస్తూ, వారిని సిరియాకు పంపేందుకు నగదు బదిలీ చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
కీలక దర్యాప్తులో భాగంగా..
తమిళనాడులోని రామంతపురంలో నివసిస్తున్న అహ్మద్ అబ్దుల్ కేదర్(40), బెంగుళూరులో నివాసం ఉంటున్న ఇర్ఫాన్ నాసిర్(33)ను అనుమానితులుగా అధికారులు గుర్తించారు. వారి దగ్గర నుంచి ఎలాక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో టెర్రర్ గ్రూప్‌నకు సంబంధించిన ఓ డాక్టర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు ఈ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేశారు.
చెన్నైలోని ఓ బ్యాంకులో కేదార్ వ్యాపార విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడని, నాసిర్.. బియ్యం వ్యాపారం చేస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
పదిరోజులు...
ఇద్దరు అనుమానితుల్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టగా... 10 రోజులు వారిని దర్యాప్తు చేయమని ఎన్ఐఏకు కోర్టు తెలిపింది.