సోమవారం జరగబోయే శాసన సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర, హరియాణాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల పర్వవేక్షణకు చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచారు అధికారులు.
మహారాష్ట్రలో 3 లక్షల మంది...
మహారాష్ట్రలో 3 లక్షల మందికిపైగా పోలీసులను మోహరించనున్నారు అధికారులు. 2 లక్షల మంది రాష్ట్ర పోలీసులు కాగా, కేంద్ర నుంచి 350 కంపెనీల సిబ్బంది, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నాగాలాండ్ మహిళా పోలీసు దళాల సేవలను వినియోగించుకోనున్నారు.
మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావం ఉన్న గడ్చిరోలి జిల్లాలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.