గ్రామస్థులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిపై తాడు సహాయంతో ఒక్కొక్కరిని దాటిస్తున్న దృశ్యాలు సినిమాను తలపించాయి. ఇద్దరు గర్భిణీలు, ఇద్దరు పసిపాపలతో సహా మొత్తం 85 మంది రక్షించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కర్ణాటక: ప్రాణాల కోసం సాహసం చేయాల్సిందే.! - బెల్తాంగాడి
భారీ వర్షాలకు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఛార్మాడీ గ్రామంలో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు, ఇద్దరు గర్భిణీ స్త్రీలతో సహా 85 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఈ దృశ్యాలు సినిమా సాహసాలను తలపించాయి.
కర్ణాటక: సినిమా దృశ్యాలను తలపించిన సహాయక చర్యలు
Last Updated : Aug 11, 2019, 9:59 AM IST