తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సల్స్​ చేతిలో ఇద్దరు పోలీసులు మృతి - పోలీసులు

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు పేట్రేగిపోయారు. బీజాపుర్​లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో గ్రామస్థుడి చాతిలో బుల్లెట్​ దిగింది.

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ ఘాతుకం

By

Published : Apr 28, 2019, 6:28 AM IST

Updated : Apr 28, 2019, 7:54 AM IST

నక్సల్స్​ దుశ్చర్య

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. బీజాపుర్​ జిల్లా పమేద్​ పోలీస్​ స్టేషన్​ ప్రాంత పరిధిలోని తోగ్గూడెం పోలీసు శిబిరం సమీపంలో కాల్పులు జరిపారు. తిప్పాపురం నుంచి క్యాంపునకు బైక్​పై వస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను పొట్టన బెట్టుకున్నారు మావోయిస్టులు.

ఈ ఘటనలో ఓ స్థానికుడి చాతిలోకీ బుల్లెట్​ దూసుకెళ్లింది. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు వారి​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Last Updated : Apr 28, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details