భారత్-అమెరికా మధ్య రెండో 2+2 ద్వైపాక్షిక చర్చలు డిసెంబర్ 18న వాషింగ్టన్లో జరగనున్నాయి. చర్చల్లో భాగంగా విదేశాంగ విధానంపై సమగ్ర సమీక్ష సహా భద్రతా, రక్షణ సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమాలోచనలు జరపనున్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించనున్నారు.
భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి జయ్శంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. అమెరికా ప్రతినిధులతో వీరిరువురు సమావేశం కానున్నట్లు తెలిపారు. అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చర్చల్లో పాల్గొననున్నారు.