ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్.. విద్యార్థుల చదువులకూ ఆటంకంగా మారుతోంది. కొవిడ్-19 భయాలతో నొయిడాలోని రెండు ప్రైవేటు పాఠశాలలను అర్ధంతరంగా మూసేసింది యాజమాన్యం. దిల్లీకి చెందిన ఓ విద్యార్థి తండ్రికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలినందున ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలను కొన్నిరోజులు మూసేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ ద్వారా సందేశం పంపినట్లు తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలు కూడా వాయిదా వేసిన్నట్లు ఈ ఉదయమే స్పష్టం చేశారు. అయితే బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.
కరోనా సోకిన వ్యక్తి కుమార్తె చదువుతున్న పాఠశాలకు మార్చి 4 నుంచి 6 వరకు సెలవులు ప్రకటించారు. మరో పాఠశాలకు నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.