తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు త్వరలో మరో 2 షినుక్​ హెలికాప్టర్లు - ముంద్రా పోర్టు

భారత్​ అమ్ములపొదిలోకి మరో రెండు షినుక్​-47ఎఫ్​(ఐ) హెలికాప్టర్లు అతి త్వరలో చేరనున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లలో షినుక్​ ఒకటి.

షినుక్​ హెలికాప్టర్లు

By

Published : Jul 9, 2019, 9:26 AM IST

భారత వాయుసేనకు మరో రెండు షినుక్-47ఎఫ్​(ఐ) హెలికాప్టర్లను త్వరలో పంపనున్నట్లు అమెరికాకు చెందిన బోయింగ్​ సంస్థ ప్రకటించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రవాణా హెలికాప్టర్లు గుజరాత్​ ముంద్రా నౌకాశ్రయానికి రానున్నాయి. ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లను ఫిబ్రవరిలో వాయుసేనకు అందించింది బోయింగ్​.

రవాణా, మౌలిక సదుపాయాల మెరుగుపరుచుకునేందుకు రక్షణ శాఖ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా బోయింగ్ సంస్థ నుంచి 22 అపాచీ, 15 షినుక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. షినుక్​ ఎంతో ప్రత్యేకమైన హెలికాప్టర్​గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వాయుసేన దగ్గరున్న ఎంఐ 26తో పోలిస్తే షినుక్​ ఇంధన వినియోగమూ తక్కువ.

మరిన్ని ప్రయోజనాలు

సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరిలించేందుకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్​లు పది టన్నుల బరువులను సైతం తేలికగా తరలిస్తాయి. ఇంధన సరఫరా, విపత్తు సహాయక కార్యక్రమాల్లో ఇవి బాగా ఉపయోగపడుతాయి.

ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్​ రైలు

ABOUT THE AUTHOR

...view details