తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో​ ఎన్​కౌంటర్- నక్సల్ కమాండర్​ హతం - naxals latest news

ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఇందులో ఒక వ్యక్తి తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

encounter in Chhattisgarh
ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​(ఫైల్​ ఫొటో)

By

Published : May 23, 2020, 3:59 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేతలు మృతిచెందారు.

గదిరాస్​ పరిధిలోని మంకపల్​ వద్ద జిల్లా రిజర్వు గార్డ్‌, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు నక్సల్స్ మరణించారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

రూ.5 లక్షల రివార్డు..

కాల్పుల్లో చనిపోయిన గంధధుర్​ అనే నక్సల్ తలపై రూ.5 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. అతడు మలంగిర్​ గొరిల్లా బృందంలో కమాండర్​ అని వెల్లడించారు. చనిపోయిన మరో నక్సల్​ను ఆయతుగా గుర్తించారు. అతడు డివిజనల్ కమిటీ సభ్యుడు వినోద్ వద్ద సెక్యూరిటీ గార్డుగా చేస్తాడని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details