ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయుస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. కన్హాయ్గూడ గ్రామంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దీటుగా స్పందించిన భద్రతా బలగాలు ఇద్దరు మావోలను మట్టబెట్టాయి. వీరిలో ఒక మహిళ ఉందని పోలీసులు తెలిపారు.
"ఛత్తీస్గఢ్ రాజధానికి 500కి.మీ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు సద్దుమణిగాక మేము యూనిఫామ్ ధరించిన ఒక మహిళా నక్సల్ సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం."
- సుందర్రాజ్, డీఐజీ, నక్సల్ వ్యతిరేక దళం