ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లను మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. కుత్రేం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత అర్ధరాత్రి ఎదురుకాల్పులు జరిగినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
దంతెవాడలో ఎన్కౌంటర్- ఇద్దరు నక్సల్స్ హతం - ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. గత అర్ధరాత్రి కుత్రేం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు నిలిచిపోయాయని, ఘటనాస్థలంలో రెండు మృతదేహాలను గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. మృతులను లచు మాండవి, పొదియాగా గుర్తించినట్లు చెప్పారు. వారిద్దరూ మలంగీర్ ప్రాంత కమిటీ సభ్యులని పేర్కొన్నారు. ఒక్కొక్కరి తలపై 5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి 9 ఎమ్ఎమ్ ఇటలీ తయారీ పిస్టోల్, 12 బోర్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. దంతెవాడ శాసనసభ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా భద్రతాదళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో దంతెవాడ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండావిని నక్సల్స్ కాల్చి చంపారు.
- ఇదీ చూడండి: గాంధీ 150: ఛత్తీస్‌గఢ్ కోసం 'కండేల్ సత్యాగ్రహం'