తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్లైడర్ కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మృతి - కేరళలో విమాన ప్రమాదం

Two Navy personnel
విమానం కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మృతి

By

Published : Oct 4, 2020, 9:58 AM IST

Updated : Oct 4, 2020, 12:45 PM IST

10:04 October 04

భారత నావికాదళానికి చెందిన ఓ గ్లైడర్‌ కూలిన ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. కేరళలోని కొచ్చి నావికాస్థావరానికి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. రోజువారీ విధుల్లో భాగంగా ఐఎన్‌ఎస్‌ గరుడ నుంచి ఓ శిక్షణా పవర్‌ గ్లైడర్‌ ఆదివారం ఉదయం టేకాఫ్‌ అయింది.

చక్కర్లు కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా తొప్పుంపాడి బ్రిడ్జికి సమీపంలో కుప్పకూలింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు వెంటనే అందులో ఉన్న లెఫ్టినెంట్‌ రాజీవ్‌ ఝా, పెట్టీ ఆఫీసర్‌ సునీల్‌ కుమార్‌ను ఐఎన్‌హెచ్‌ఎస్‌ సంజీవనికి తరలించారు. అప్పటికే వారివురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

09:54 October 04

విమానం కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మృతి

కేరళ కొచ్చిలో విమానం కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మరణించారు. ఈ మేరకు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.

Last Updated : Oct 4, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details