కర్ణాటకలో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ బొమ్మైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన... తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే గోపాలయ్య కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.