ఉగ్రవాదంవైపు ఆకర్షితులై ముఠాలో చేరిన జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు యువకులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు, సైనిక అధికారుల ఎదుట లొంగిపోయారు.
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు లొంగుబాటు - భద్రతా బలగాల ఎదుట లొంగిపోయిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు.. భారత సైన్యం ఎదుట లొంగిపోయారు. ఇటీవలే వారు ఉగ్రవాద ముఠాలో చేరినట్లు తెలుస్తోంది.
కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు లొంగుబాటు
ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలో భారత దళాలు నిర్భంద తనీఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో సోపోర్ పట్టణానికి చెందిన 20, 21 ఏళ్ల ఇద్దరు యువకులు అధికారులకు తారసపడ్డారు. కొత్తగా ముఠాలో చేరిన వీరు.. పోలీసులు, అర్మీ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ఉగ్ర ముఠాలో చేరిన జహంగిర్ భట్ అనే వ్యక్తి కూడా ఇటీవలే ఆర్మీ అధికారులకు లొంగిపోయాడు.
ఇదీ చదవండి:నేపాలీయుల కోసం.. భారత్‌లో ఆ బ్రిడ్జ్ పునఃప్రారంభం
Last Updated : Oct 22, 2020, 5:09 PM IST