జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది భారత సైన్యం.
జమ్మూలో ఎన్కౌంటర్... ఇద్దరు ముష్కరులు హతం - జమ్మూలో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. దీటుగా స్పందించిన భారత సైన్యం.. ఇద్దరు ముష్కరులను హతమార్చింది.
జమ్మూలో ఎన్కౌంటర్... ఇద్దరు ముష్కరులు హతం
షోపియాన్ జిల్లాలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. భద్రత బలగాలపై కాల్పులకు తెగపడ్డారు. దీంతో సైన్యం ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ముష్కరులను హతమార్చింది. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:పాక్ చొరబాటుదారుడి అరెస్టు- ప్రశ్నిస్తున్న బలగాలు
TAGGED:
జమ్మూలో ఎన్కౌంటర్