జమ్ముకశ్మీర్ షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. జైన్పొరాలోని మెల్హోరా వద్ద మంగళవారం నిర్బంధ తనిఖీలు చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బందిపై దాడికి దిగారు ముష్కరులు. ప్రతిఘటించిన బలగాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నిన్న సాయంత్రం ఒకరు చనిపోగా.. ఇవాళ మరో ఇద్దరని హతమార్చింది.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం - shopian
నియంత్రణ రేఖ వెంబడి విరుచుకుపడుతున్న ఉగ్రవాదులకు భారత్ దీటుగా బదులిస్తోంది. ముష్కరుల్ని ఏరిపారేస్తోంది సైన్యం. జమ్ముకశ్మీర్ షోపియాన్లో మంగళవారం నుంచి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చింది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
![కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం two militant killed in encounter with security forces in J&K's Shopian](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6969111-617-6969111-1588077002570.jpg)
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
ముష్కరుల కోసం భద్రతా దళాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Apr 29, 2020, 12:17 PM IST