తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు ట్రక్కులు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం - ACCIDENT IN SEONI

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివానీ జిల్లాలోని ఛప్రా ప్రాంతంలో రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

TWO MAN ALIVE BURNT IN TRUCK
రెండు ట్రక్కులు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

By

Published : Aug 13, 2020, 5:20 PM IST

మధ్యప్రదేశ్​ శివానీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి మరో లారీని ఢీకొనటం వల్ల మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇరు ట్రక్కుల డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాలిపోతున్న ట్రక్కులు

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని..

నాగ్​పుర్​ నుంచి జబల్​పుర్​ వైపు వెళుతోన్న ఓ లారీ.. శివానీ జిల్లాలో ఛప్రా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బంజారి​ ఆలయం వద్ద జాతీయ రహదారి 7పై అదుపుతప్పింది. డివైడర్​ను దాటుకుని అటువైపున నాగ్​పుర్​ వైపునకు వెళుతోన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. రెండు లారీల క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెనువెంటనే లారీల్లో మంటలు చెలరేగాయి. రెండు వాహన డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. రెండు ట్రకుల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఛప్రా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. రోడ్డుపై పడిన ట్రక్కులను పక్కకు జరిపి.. ట్రాఫిక్​ను తొలగించారు.

ఇదీ చూడండి: రోడ్డుపై యాసిడ్​ ట్యాంకర్​ లీక్​.. అంతా భయం గుప్పిట్లో!

ABOUT THE AUTHOR

...view details