తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్​- ఇద్దరు మృతి - మధ్యప్రదేశ్​ ఖంద్వా జిల్లాలో పారాగ్లైడింగ్​ ప్రమాదం

పారాగ్లైడింగ్​ చేస్తూ.. 100 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు వ్యక్తులు. మధ్యప్రదేశ్​లోని ఖంద్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

paragliding accident
ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్​.. ఇద్దరు మృతి

By

Published : Jan 21, 2021, 9:10 AM IST

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్​ చేస్తూ.. పడిపోయి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఖంద్వా జిల్లా హనువంతియాలో బుధవారం సాయంంత్రం ఈ ఘటన జరిగింది.

ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్​.. ఇద్దరు మృతి

ఓ ఈవెంట్​ మేనేజ్​మెంట్ సంస్థ ఉద్యోగులైన ఇద్దరు వ్యక్తులు పారాగ్లైడింగ్​​ చేస్తూ.. 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినట్లు మూందీ సబ్​ ఇన్​స్పెక్టర్​ బీఎస్​ మండ్లోయ్​ తెలిపారు. వారిద్దరినీ మూందీలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. మృతులను రాజస్థాన్​ పాలి జిల్లా బుద్దా మంగ్లియాన్​కు చెందిన గజ్​పాల్​ సింగ్​(28), మధ్యప్రదేశ్​లోని రాజ్​గడ్​లోని భగోరాకు చెందిన బల్చంద్​ దంగి(32)గా గుర్తించారు.

ఈ ఘటనపై మెజీస్టీరియల్​ దర్యాప్తు జరపాలని పునాసా సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్​ను ఖంద్వా కలెక్టర్​ ఆదేశించారు. వీరి మృతిపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి:12 ఏళ్ల బాలికపై బాలుడు అత్యాచార యత్నం

ABOUT THE AUTHOR

...view details