తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుక్మాలో గల్లంతైన 17మంది జవాన్లు మృతి - ఛత్తీస్​గఢ్​ నక్సల్​ దాడి

చత్తీస్​గఢ్​ సుక్మా ఎదురుకాల్పుల్లో గల్లంతైన 17 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు గుర్తించారు అధికారులు.

two-jawans-dead-body-found-with-help-of-drone-in-sukma
డ్రోన్ల సాయంతో జవాన్ల మృతదేహాల గుర్తింపు

By

Published : Mar 22, 2020, 1:58 PM IST

Updated : Mar 22, 2020, 4:15 PM IST

సుక్మా ఎదురుకాల్పుల్లో నిన్న గల్లంతైన 17 మంది జవాన్ల మృతదేహాలను నేడు గుర్తించారు అధికారులు.

"నిన్నటి ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు గల్లంతయ్యారు. వారిని వెతికేందుకు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాం. నేడు అడువిలో ఆ 17 మంది మృతదేహాలను గుర్తించింది సెర్చ్​ టీం."

-సుందర్​ రాజ్​, బస్తర్​ ఐజీ

ఆకస్మిక దాడి..

ఎల్మాగుండాలో నక్సల్​ శిబిరాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఆర్​పీఎఫ్​.. శనివారం ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం జిల్లా రిజర్వ్​ గార్డ్(డీఆర్​జీ), స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్​), కమాండో బెటాలియన్​ ఫర్​ రిసొల్యూట్​ యాక్షన్​(కోబ్రా) బృందాల నుంచి దాదాపు 600 జవాన్లను మోహరించింది.

మిన్పా గ్రామ శివార్లలో పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న సైనిక బృందాలను సుమారు 250 మంది నక్సలైట్లు చుట్టుముట్టారు. ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. మావోలకు దీటుగా పోలీసులు బదులిచ్చారు.

రెండున్నర గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో.. 15 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. క్షతగాత్రులను హెలికాప్టర్​ల ద్వారా రాయపుర్​ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఐజీ సుందరరాజ్​ తెలిపారు.

గల్లంతైన వారి కోసం అనేక గంటలపాటు వెతికారు భద్రతా సిబ్బంది. చివరకు 17 మంది మృతదేహాలను గుర్తించారు.

ఇదీ చదవండి:దిల్లీ నుంచి గల్లీ వరకు.. అన్నీ బంద్

Last Updated : Mar 22, 2020, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details