మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. మైనర్‌ను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఇందోర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారితో పాటు ఓ మహిళ సహా మరో ఇద్దరు మాదక ద్రవ్యాల సరఫరాదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా కొంతమంది బాలురు, బాలికలను పునరావాస కేంద్రానికి పంపినట్లు ఇందోర్ అదనపు ఎస్పీ రాజేశ్ రఘువంశీ తెలిపారు. వారిలో ఓ అమ్మాయి.. గతేడాది నవంబర్ నుంచి తనపై ఇద్దరు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పిందని తెలిపారు. నిందితులు అమన్ వర్మ, గజినీ అలియాస్ ఆకాశ్‌లపై లసూదియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.