"ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నాం. ఇందుకోసం 11వ తేదీన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించాం. ఛాయ్, అల్పాహారంపై 50 శాతం రాయితీ ఇస్తున్నాం. మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు. రాయితీ వర్తిస్తుంది."
-గణేశ్, హోటల్ సహ యజయాని
భారత్ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా - నాగ్‌పుర్
ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని వినూత్న పద్ధతిలో కోరుతున్నారు ఇద్దరు యువకులు. ఏప్రిల్ 11న ఓటు వేసిన వారందరికీ ఆఫర్ ప్రకటించారు.
ఆలూ బోండా దుకాణం
ఇదీ చూడండి:రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్' రగడ
"ఈ ఆలోచన చాలా నచ్చింది. ఎందుకంటే రెండో కోణంలో ఆలోచించారు. అవగాహన కల్పించడమే కాక ఆఫర్ కూడా ఇస్తున్నారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలి."
-స్థానిక మహిళ, నాగ్‌పుర్