తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు గవర్నర్లు బదిలీ- బంగాల్​కు జగ్​దీప్​ - new governors

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్​ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు.

ఇద్దరు గవర్నర్లు బదిలీ- బంగాల్​కు జగ్​దీప్​

By

Published : Jul 20, 2019, 2:54 PM IST

నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి నియమితులయ్యారు. బంగాల్‌ గవర్నర్‌గా జనతా దళ్ మాజీ​ ఎంపీ, ప్రముఖ న్యాయవాది జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బయాస్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్​ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్‌... ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.

బిహార్‌ గవర్నర్‌గా ఉన్న లాల్‌జీ టాండన్... మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. లాల్‌జీ టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా ఫాగు చౌహాన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ABOUT THE AUTHOR

...view details