ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఇద్దరు బాలికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి సంబంధంపై రెండు కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ద్వేషం నుంచి పుట్టిన ప్రేమ!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఇద్దరు బాలికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి సంబంధంపై రెండు కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ద్వేషం నుంచి పుట్టిన ప్రేమ!
రతి తివారీ, నందిని గౌతమ్ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం పరిచయం అయింది. ఇద్దరికీ పురుషులంటే ద్వేషం కాబట్టి.. రెండు మనసులూ ఏకమయ్యాయి. అయితే.. ఈ విషయంపై ఇద్దరు అమ్మాయిల కుటుంబ సభ్యులు, సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆ ఇద్దరు బాలికలు పారిపోయి.. కాన్పుర్‌లోని బర్రా ప్రాంతంలో వివాహం చేసుకున్నారు.
ఈ విషయమై నందిని తల్లి గుడియా దేవి.. తన కుమార్తెను రతి, ఆమె సోదరుడు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఘటనపై కూతురు నందిని స్పందించింది. రతిని తాను ఇష్టపూర్వకంగానే వివాహమాడానని.. తన తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పింది.
ఇదీ చదవండి:యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి