తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీఎస్​ఎఫ్ ప్రధాన​ కార్యాలయంలో కరోనా కలకలం - corona latest news

Two floors in Delhi BSF headquarters sealed after staff member tests positive for COVID-19
బీఎస్​ఎఫ్ ప్రధాన​ కార్యాలయంలో కరోనా కలకలం

By

Published : May 4, 2020, 12:51 PM IST

Updated : May 4, 2020, 1:41 PM IST

13:15 May 04

సరిహద్దు భద్రతా దళం ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను సీల్​ చేశారు అధికారులు. కార్యాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. భవనం లోపల, పరిసర ప్రాంతాలను శానిటైజ్​ చేశారు.  

వివరాల ప్రకారం.. దిల్లీ బీఎస్​ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని ఒకటో అంతస్తులో విధులు నిర్వర్తిస్తున్న హెడ్​ కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అతడు చివరగా మే1 న ఆఫీసుకు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఆ కానిస్టేబుల్​తో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి క్వారంటైన్​ చేశారు. వారికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 

సిబ్బందికి కరోనా సోకిన తర్వాత.. మొదటి రెండు ఫ్లోర్లను సీల్​ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.  

దిల్లీ లోధిరోడ్డులోని సీజీఓ కాంప్లెక్స్​లో 8 అంతస్తుల భవనంలో బీఎస్​ఎఫ్​ ప్రధాన కార్యాలయం ఉంది. సీఆర్​పీఎఫ్​ ప్రధాన కార్యాలయం కూడా ఇందులోనే భాగమై ఉంది. ఇద్దరు సిబ్బందికి కొవిడ్​ సోకగా ఆదివారమే సీఆర్​పీఎఫ్​ ఆఫీసును మూసివేశారు. ఇవాళ.. బీఎస్​ఎఫ్​ కార్యాలయానికి సీల్​ వేశారు.

12:46 May 04

బీఎస్​ఎఫ్ ప్రధాన​ కార్యాలయంలో కరోనా కలకలం

దిల్లీలోని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) ప్రధాన కార్యాలయంలోని రెండు ఫ్లోర్లను సీల్​ చేశారు అధికారులు. కార్యాలయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శానిటైజేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. 

Last Updated : May 4, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details