తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఆడియో టేపుల వల్ల కేంద్ర మంత్రికి చిక్కు! - Gajendra Singh Shekhawat

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఆడియో టేపులు రాజస్థాన్​లో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని వీటి ఆధారంగా అధికార కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 2 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే.. ఆడియో క్లిప్​లో పేరు వినిపించిన సంజయ్​ జైన్​ను ప్రశ్నిస్తున్నారు.

Two FIRs lodged in Rajasthan over Cong complaints
రాజస్థాన్​లో 'ఆడియో క్లిప్స్​' దుమారం

By

Published : Jul 17, 2020, 2:46 PM IST

రాజస్థాన్​లో రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఆడియో క్లిప్​లతో మరింత దుమారం చెలరేగింది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రతో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతున్నారని.. కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజస్థాన్​ పోలీసులు రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు.

" ఎమ్మెల్యేల కొనుగోలు, సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్​ల వైరల్​ పై.. ఐపీసీలోని సెక్షన్​ 124-ఏ(తిరుగుబాటు), 120-బీ(కుట్ర)కింద రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. ఓ ఆడియో క్లిప్​లో సంజయ్​ జైన్​ పేరు వినిపించిన నేపథ్యంలో విచారణకు పిలిపించి.. ప్రశ్నించాం."

- అశోక్​ రాఠోడ్​, ఏడీజీ(ఏటీఎస్​, ఎస్​ఓజీ)

అరెస్ట్​కు డిమాండ్​..

రెండు ఆడియో టేపుల ద్వారా కేంద్ర మంత్రి, భాజపా నేత గజేంద్ర సింగ్​ షెకావత్​, రెబల్​ ఎమ్మెల్యే భన్వర్​లాల్​ శర్మ, భాజపా నేత సంజయ్​ జైన్​ల చర్చలు బయటపడ్డాయని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా. రాజస్థాన్​ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వెలుగులోకి వచ్చిందటూ ట్వీట్​ చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​, ఎమ్మెల్యే భన్వర్​లాల్​ను అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

దేనికైనా రెడీ..

కాంగ్రెస్​ ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​. ఆ ఆడియోల్లో ఉన్నది తన గొంతు కాదని, ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తు ఎదుర్కోవటానికైనా సిద్ధమని వెల్లడించారు.

ఇదీ చూడండి: పైలట్​ వర్గంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్​ వేటు

ABOUT THE AUTHOR

...view details