తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాప పేరు 'కరోనా'.. బాబు పేరు 'లాక్‌డౌన్‌' - Live Coronavirus updates

ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న పదాలు కరోనా, లాక్​డౌన్. అయితే వీటినే తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకున్నాయి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రెండు కుటుంబాలు. కరోనాపై అవగాహన పెరగడం కోసమే ఇలా చేశామని చెబుతున్నాయి.

corona, lockdown
పాప పేరు ‘కరోనా’.. బాబు పేరు ‘లాక్‌డౌన్‌’

By

Published : Apr 2, 2020, 7:15 AM IST

కరోనా వైరస్‌ మహమ్మారి పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు కుటుంబాలు తమ పిల్లలకు కరోనా, లాక్‌డౌన్‌ అని పేర్లు పెట్టుకున్నాయి. జనతా కర్ఫ్యూ రోజు సోహ్‌గౌర గ్రామానికి చెందిన బబ్లు త్రిపాఠి, రాగిని దంపతులకు ఆడ బిడ్డ పుట్టగా 'కరోనా' అని పేరు పెట్టుకున్నారు.

గత నెల 29న తన భార్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాబుకు జన్మనిచ్చిందని.. ఆ బాబుకు 'లాక్‌డౌన్‌' అని పేరు పెట్టామని ఖుఖుండు గ్రామానికి చెందిన పవన్‌ ప్రసాద్‌ తెలిపారు.

ప్రజలు తమ పిల్లలను చూసినప్పుడల్లా కరోనా వైరస్‌పై అవగాహన పెరగడంతో పాటు ఆరోగ్య విషయంలోనూ అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నట్లు ఆ కుటుంబాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: దేశంలో 1,834కు చేరిన కరోనా కేసులు.. 41 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details