బంగాల్లో భూకంపం సంభవించింది. బహారాంపుర్కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు ఐరోపా-మధ్యధరా భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైందని తెలిపింది.
బంగాల్లో రెండు చోట్ల భూప్రకంపనలు
బంగాల్లో రెండు చోట్ల భూకంపం సంభవించింది. బహారాంపుర్, దుర్గాపుర్ ప్రాంతాల్లో 3.8, 4.1 తీవ్రతలతో భూమి ఒక్కసారిగా కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు.
బంగాల్లో రెండు చోట్ల భూప్రకంపనలు
తెల్లవారుజామున దుర్గాపుర్ ప్రాంతంలోనూ 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇదీ చూడండి భారత్ వ్యూహం: దీవులతో చైనాకు దీటుగా..!