తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం మత్తులో డ్రైవింగ్​- ఇద్దరు పాదచారులు బలి - road accident in jharkhand's chutia

అతివేగం మరో రెండు ప్రాణాలను బలిగొంది. ఝార్ఖండ్​లోని చుటియా ప్రాంతంలో అర్ధరాత్రి మద్యం సేవించి కారు నడుతున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న వారిపైకి దూసుకెళ్లాడు. ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

two died in road accident in ranchi
మద్యం మత్తులో డ్రైవింగ్​- ఇద్దరు పాదచారులు బలి

By

Published : Jan 1, 2020, 12:29 PM IST

ఝార్ఖండ్​లో అతిగా మద్యం సేవించిన వ్యక్తులు కొత్త సంవత్సరం తొలిరోజు వీరంగం సృష్టించారు. చుటియా ప్రాంతంలోని పటేల్​ చౌక్​ వద్ద రాత్రి రెండు గంటల సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వెళ్తున్న వ్యక్తులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్​లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

క్యాటరింగ్ ముగించుకొని వెళ్తుంటే

ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్న స్థానికులు కారు డ్రైవర్​ను చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితులందరూ క్యాటరింగ్ విధులు​ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చుటియా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారు ప్రమాదకరమైన వేగంతో నియంత్రణ లేకుండా ప్రయాణించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: స్వాగతం 2020: బాపూజీ బాటలో డైరీ రాద్దాం

ABOUT THE AUTHOR

...view details