ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని గోలెబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్జికల్ స్పిరిట్ తాగిన ఇద్దరు మందుబాబులు మృతి చెందారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ కుంజమ్(40), అస్గర్ హుస్సేన్(42), దినేశ్ సముద్రే(39) దగ్గర్లోని ఔషధాల దుకాణానికి వెళ్లి సర్జికల్ స్పిరిట్ కొనుక్కుని తాగారు.