తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహోద్యోగులపై సీఆర్​పీఎఫ్​ జవాను కాల్పులు- ఇద్దరు మృతి - ఝార్ఖండ్​ ఎన్నిక

ఝార్ఖండ్​ ఎన్నికల కోసం బొకారోలో మోహరించిన సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​లో సహోద్యోగులపై కాల్పులు జరిపాడు ఓ జవాన్​. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

CRPF
సహోద్యోగులపై సీఆర్​పీఎఫ్​ జవాను కాల్పులు

By

Published : Dec 10, 2019, 10:34 AM IST

Updated : Dec 10, 2019, 12:29 PM IST

సహోద్యోగులపై సీఆర్​పీఎఫ్​ జవాను కాల్పులు

ఝార్ఖండ్​ ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​ క్యాంపులో దుశ్చర్యకు పాల్పడ్డాడు ఓ జవాన్​. సహోద్యోగులపైనే కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో అసిస్టెంట్​ కమాండెంట్​ ర్యాంకు అధికారితో పాటు అసిస్టెంట్​ సబ్​ ఇన్స్​పెక్టర్​ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఆర్​పీఎఫ్​ చార్లీ కంపెనీకి చెందిన 226వ బెటాలియన్​ను బొకారో ప్రాంతంలో మోహరించారు. సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఓ జవాను సహోద్యోగులపై కాల్పులు జరిపి ఇద్దరి ప్రాణాలు తీశాడు. కాల్పులకు పాల్పడిన జవాను కూడా గాయపడ్డాడు.

ఘటనకు కారణాలు ఇంక తెలియరాలేదని.. దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఆర్​పీఎఫ్​ ఉన్నాతాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్​!

Last Updated : Dec 10, 2019, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details