మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని నిర్బంధ కేంద్రం నుంచి కరోనా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెడ్షీట్లను తాడుగా మలచి, గది కిటికీ చువ్వలను వంచి ఆదివారం రాత్రి పారిపోయినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బేగంపుర పోలీసులు ఓ జైలు ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పారిపోయిన ఖైదీలను వెతికి పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు జైలు అధికారులు తెలిపారు.