పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగించింది పాక్ సైన్యం. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సరిహద్దులో పాక్ కాల్పులు.. ఇద్దరు పౌరుల మృతి - Two civilians died and seven were injured in ceasefire violation by Pakistan in Shahpur sector of Poonch district,
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో.. పాక్ సైన్యం మరోమారు కాల్పులకు తెగించింది. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
![సరిహద్దులో పాక్ కాల్పులు.. ఇద్దరు పౌరుల మృతి Two civilians died and seven were injured in ceasefire violation by Pakistan in Shahpur sector of Poonch district,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5256786-791-5256786-1575375280471.jpg)
సరిహద్దులో పాక్ కాల్పులు.. ఇద్దరు కశ్మీర్ వాసులు మృతి
షాపుర్, కిర్ణీ ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారని.. వాటిని దీటుగా తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.