ఆడించి, లాలించాల్సిన ఇద్దరు చిన్నారుల్ని దారుణంగా బహుళ అంతస్థుల భవనం మేడపైనుంచి తోసేశాడో వ్యక్తి. పశ్చిమ్ బంగాలోని కోల్కతాలో జరిగిందీ ఘటన. వీరిలో ఒకరి వయసు రెండేళ్లు కాగా.. ఇంకో చిన్నారికి ఆరేళ్లు. తక్షణమే స్థానికులు స్పందించి ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చిన్నారుల్ని మేడపై నుంచి తోసేసిన కిరాతకుడు - కోల్కతా వార్తలు
మానవత్వం మరోసారి మంటగలిసింది. అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారుల్ని ఎత్తైన భవనం నుంచి తోసేశాడో కర్కశుడు. ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండగా.. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారుల్ని మేడపై నుంచి తోసేసిన కిరాతకుడు
ఈ ఘటనలో నిందితుడు శివ్కుమార్ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రాథమిక విచారణలో అతడు.. నేరాన్ని అంగీకరించినట్లు తెలిపిన పోలీసులు, కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అక్కడ కోతులకో పార్కు.. ప్రజల కోరిక మేరకే!