తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు - ujjain brothers dragging bullock cart

ఎద్దులు లేకుండానే వందల కిలోమీటర్లు ప్రయాణించింది ఓ జోడెడ్ల బండి. అది ఎలా అనుకుంటున్నారా? లాక్​డౌన్​ వేళ.. మరణించిన తోబుట్టువులను దహనం చేయడానికి ఎద్దులను అమ్ముకుని.. ఆ అస్థికలను నదిలో కలిపేందుకు వెళ్లడానికి.. బండికి కాడెడ్లయ్యారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. మహారాష్ట్రలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

two-brothers-pull-bullock-cart-in-ujjain
అస్తికలు నదిలో కలిపేందుకు అన్నదమ్ముల అష్టకష్టాలు

By

Published : Jun 5, 2020, 4:23 PM IST

Updated : Jun 5, 2020, 5:20 PM IST

అస్తికలు నదిలో కలిపేందుకు అన్నదమ్ముల అష్టకష్టాలు

భగభగ మండే ఎండలో ఓ ఎడ్ల బండి. అందులో గంపెడు సామాను. ఆ బండి వెనుకాలే ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు. అప్పటికే వందల కిలోమీటర్లు ప్రయాణించినట్టున్నారు. ఎద్దులు బండి నడుపుతుండగా వీరేంటీ ఇంత కష్టపడి నడుస్తున్నారని ముందుకెళ్లి చూస్తే.. ఎద్దులు లేవు. వాటి స్థానంలో ఇద్దరు అన్నదమ్ములున్నారు. అవును, లాక్​డౌన్​ వేళ భారమైన బతుకు బండిని ఓ కుటుంబానికి చెందిన వలస సోదరులు ఇలా మోస్తూ మహారాష్ట్రలో ఈటీవీ భారత్​ కంటపడ్డారు.

కుటుంబమంతా రోడ్డున పడ్డాం..

సునీల్​ అనే ఓ వలస కార్మికుడి కుటుంబం ఉజ్జయిన్ ​నినోరాలో జీవనం సాగిస్తోంది. వలస కార్మికులు అయినందున వీరికి అక్కడ సొంతిల్లు కూడా లేదు.. పైగా సునీల్​ కుటుంబంలో కొద్ది రోజుల క్రితం విషాదం చోటుచేసుకుంది. సునీల్​ సోదరి, సోదరుడు ఇద్దరూ కిడ్నీ సమస్యతో మరణించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సునీల్​.. ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలీక సతమతమయ్యాడు. ఏళ్లుగా పెంచుకుంటున్న రెండు ఎద్దులను కేవలం రూ.18 వేలకు అమ్మేసి ఆ డబ్బుతో ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇక నినోరాలో జీవనోపాధి కరవైనందున వేరే గ్రామానికి వలస వెళదామని నిర్ణయించుకుంది సునీల్ కుటుంబం. అందుకే తమ సామగ్రిని ఎడ్ల బండిపై ఉంచి కుటుంబం మొత్తం.. పాదయాత్ర చేస్తున్నారు. ఇక బండిని లాగేందుకు ఎద్దులు కూడా లేనందున సోదరులిద్దరూ జోడెడ్లుగా మారి బతుకు బండిని లాగుతున్నారు. ఏదైనా గ్రామంలో స్థిరపడదామనుకుంటే కరోనా భయంతో ఏ ఒక్కరూ వారికి ఆశ్రయం కల్పించడం లేదు. తల్లి, ఇద్దరు తమ్ముళ్లు, ఓ చెల్లిని వెంటబెట్టుకుని కొత్త జీవితం ఆశతో పయనమయ్యాడు సునీల్​.

ప్రస్తుతం మధ్యప్రదేశ్​లోని క్షిప్రా నదిలో చనిపోయిన తన తోబుట్టువుల అస్థికలనుకలిపేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు అన్నదమ్ములు.

ఇదిగో నా బిడ్డల అస్తికలు ఈ బిందెలోనే ఉన్నాయి..

సునీల్​ ఓ వైపు, సునీల్​ తమ్ముడు మరో వైపు భుజాలపై కాడెను మోస్తూ.. రెండు రోజులు ఏదైనా ఊర్లో విశ్రాంతి తీసుకుందామంటే కరోనా భయంతో గ్రామస్థులు లోపలికి రానివ్వట్లేదు. గత్యంతరం లేక, ఒక్కో రోజు, ఒక్కో ఊర్లో బస చేస్తూ.. కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.

అమ్మా కాసేపు సేదదీరుదాం!

ఇదీ చదవండి:ఆ రెండేళ్ల చిన్నారికి గజరాజుతోనే దోస్తీ!

Last Updated : Jun 5, 2020, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details