పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు.
పాక్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు గాయాలు - తెలుగు తాజా భారత్ సరిహద్దు వార్తలు
జమ్ము కశ్మీర్ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం మరో సారి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు.
![పాక్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు గాయాలు Two Army jawans injured in Pak firing along LoC in J-K's Rajouri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5365566-7-5365566-1576251353629.jpg)
పాక్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు గాయాలు
కేరీ ప్రాంతంలోని భారత సైనిక బృందంపై పాక్ కాల్పులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు. ప్రతిఘటన చర్యలో ప్రత్యర్థుల్లో ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉందని వెల్లడించారు.